కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి * బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?
కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి
* బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?
సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు):
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎల్.వెంకటేశన్ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బన్సీలాల్ పేట లో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని, ఈ సంగతి సామాన్య ప్రజలకు తెలుసునని అన్నారు. కొన్ని అభివృద్ది పనులు అయితే ప్రభుత్వం నిధులతో కాకుండా అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో చేసిన దాఖలాలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. నిత్యం ప్రజల మద్య ఉంటూ, ప్రజల సంక్షేమానికి అండగా నిలుస్తున్న గొప్ప నేత తలసాని శ్రీనివాస యాదవ్ అని అన్నారు. ముందుగా ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు హామినిచ్చిన కాంగ్రెస్ నాయకులు వాటికి సమాధానం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.