పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు )
పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి
స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే జారిచేయబడిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలని ఎస్పీ అన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల లో బాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్‌నెస్,స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా లో రోడ్డు ప్రమాదల నివారనే లక్ష్యంగా స్కూల్స్ బస్ డ్రైవర్స్ కి ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నరు. చాలా వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణించే వారిలో చిన్న పిల్లలే ఉంటారు కాబట్టి వారి పట్ల చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. పిల్లలని స్కూల్ కి తీసుకొని వచ్చేటప్పుడు, ఇంటికి తీసుకొని వెళ్లే క్రమంలో బస్సు హెల్పర్ వెనుక ముందు చూసుకొన్నాకనే వారిని దించాలి, పిల్లలు రోడ్డు దాటవలసివస్తే హెల్పర్ తప్పక దాటించాలని సూచించారు. బస్ కి సంబంధించి అన్ని వాహన పత్రాలు కల్గివుండాలని, బస్సు సరైన కండిషన్ లో ఉందో లేదో ముందే జాగ్రత్తపడాలని, బస్సు బ్రేక్, లైట్స్, ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్ మరియు వైపర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చూసుకోవాలని సూచించారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఎన్నో కుటుంబాలు బస్సు డ్రైవర్ల మీద చాలా నమ్మకంతో తమతమ పిల్లలని స్కూల్స్ కి బస్సుల్లో పంపిస్తున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఈ సంధర్బంగా తెలియజేశారు. ఎవరైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించక పోతే వారిపై చట్టపరమైన చర్యలు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లో నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై పోలీస్ , ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ పలు స్కూల్ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా అని స్వయంగా పరిశీలించి పాటించని వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, DTO శ్రీనివాస్, RI వేణు, ఎస్సైలు సుధాకర్, మల్లేశం, గీత, రవాణా శాఖ అధికారులు, స్కూల్ వ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రావు,పోలీస్ సిబ్బంది , స్కూల్ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.