బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు )
భారతీయ జనతా పార్టీ "సంవిధాన్ గౌరవ అభియాన్" కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2015 న తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నాం దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది. సర్వోన్నతమైనది. గతంలో భారత రాజ్యాంగం 75 వ వార్షికోత్సవం పై పార్లమెంట్ ఉభయ సభలో సమగ్ర చర్చ జరిగింది ప్రధాని మోడీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవార్థం అభివృద్ధితో పాటు పేదలు అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా అనేక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూన్నాయి. రాజ్యాంగ 75 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో చేసిన ప్రసంగం మనందరికీ స్ఫూర్తిదాయకం ప్రతి కార్యకర్తల విషయాన్ని సామాన్య ప్రజలకు చేరువేయాలి అనే ఉద్దేశంతో బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు జనవరి 11 నుండి 25 వరకు "సంవిధాన్ గౌరవ అభియాన్" అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించి ప్రతి భారతీయ పౌరుడు కి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, రగిల్ల సత్యనారాయణ,జిల్లా కార్యదర్శి జంబర్తి దివాకర్, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివం మరియు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.