మస్జీద్ కమిటీకి ఎన్నికలు నిర్వహించండి
మస్జీద్ కమిటీకి ఎన్నికలు నిర్వహించండి..
* వక్ఫ్ బోర్డు చైర్మన్ కు భోలక్ పూర్ ముస్లింల వినతి
సికింద్రాబాద్, జనవరి 21 ( ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలోని ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న మస్జీద్ అహాలే హదీస్ కమిటీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని భోలక్ పూర్ ప్రాంత ముస్లిం సోదరులు రాష్ర్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సెనీ కి విజ్ఞప్తి చేశారు. మంగళవారం డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన్ని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రతి శుక్రవారం ప్రార్థనల నిర్వహణ విషయంలో తరచుగా ముషీరాబాద్, భోలక్ పూర్ ప్రాంత వాసుల మద్య గొడవలు జరుగుతున్నాయని వారు వాపోయారు. వెంటనే మస్జీద్ కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని వీరు చెప్పగా, అందుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఐత చిరంజీవి తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలీమ్, సాయిసందీప్, ఎం.ఖయ్యూమ్, సయ్యద్ ఇక్బాల్, ఎండీ సయ్యద్, ఎండీ ఉస్మాన్, ఎండీ ఇమ్రాన్, ఎండీవాసీమ్ పాల్గొన్నారు.: