ప్రజావాణిలో 5,736 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల వెల్లువ
ప్రజావాణిలో 5,736 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల వెల్లువ
ఓపికతో దరఖాస్తులు స్వీకరించిన ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య
హైదరాబాద్ జనవరి 21:
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 5,736 దరఖాస్తులు అందాయి.
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ప్రజా భవన్ నుంచి బయట రోడ్డు జ్యూవెలరీ దుకాణాల వరకు ప్రజలు క్యూ కట్టారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 132, విద్యుత్ శాఖ కు సంబంధించి 131, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 43, ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 01, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 5,332 దరఖాస్తులు వచ్చాయి, ఇతర శాఖలకు సంబంధించి 97 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్. జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని ఓపికతో దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.