జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించిన
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి (ధర్మారం) జనవరి 21 ప్రజా మంటలు
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా సోమవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాఠశాలను సందర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సన్మానించి అభినందించారు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు
ఈ సందర్భంగా వారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన టీ. మనోజ్ఞ ఫుట్ బాల్ క్రీడలో జమ్ము కాశ్మీర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగిందని,బి.సింధు ప్రియా వాలీబాల్ క్రీడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగిన జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగిందని,భీ.వైష్ణవి సాఫ్ట్ బాల్ SGF అండర్ 19 మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంనడం జరుగుతుందని అదేవిధంగా ఓ. సౌజ్ఞ శ్రీ గుజరాత్ రాష్ట్రంలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం జరిగిందని,ఏ రంజిత్ కుమార్ బీహార్ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్లో పోటీల్లో పాల్గొనడం జరిగిందని,బి.అశ్రిత గుజరాత్ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం జరిగిందని ఇంకా పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరిని అభినందిస్తున్నామని,సుమారుగా 30 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో,ఆరుగురు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ,వారికి శిక్షణ ఇచ్చిన వారి PET లను,స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను అభినందిస్తున్నమని,ఈ సందర్భంగా 24 నుంచి 27 వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి అండర్ 19 SGF పోటీల్లో పాల్గొననున్న బి. వైష్ణవికి ప్రయాణ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని,అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ కోసము నా ఒక నెల జీతాన్ని చెక్కు రూపంలో ప్రిన్సిపాల్ కు అందజేస్తామని,అదే విధంగా పాఠశాలకు క్రీడా ప్రాంగణాన్ని,పాఠశాల ఆవరణలో జిమ్ము,ఏర్పాటు చేసి,ఇంకా ఏమైనా సమస్యలు ఉన్న వాటిని పరిష్కరిస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య మేకల సంజీవరావు తల్లిదండ్రులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు