టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జనవరి 21:
జిల్లా కలెక్టర్ శ్రీ బి.సత్యప్రసాద్, టి.ఎన్.జీ.ఓ. ల సంఘం 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవోలు జిల్లా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉద్యోగుల నిరంతర కృషి వలననే జగిత్యాల జిల్లా అన్నిరంగాలలో ముందు వరుసలో ఉన్నదని, ఈ సంవత్సరం కూడా ఇదే స్ఫూర్తి తో పనిచేద్దామని అన్నారు.
తదుపరి ఉధ్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు సాహెద్బాబు, మహమూద్, రాజేందర్, రాజేశం, సుగుణకర్, మధుకర్, మమత, శైలజ, శ్రావణి, రాజశ్రీ, అరుణ, శ్రీనివాస్ స్వామి, హరి ప్రసాద్, కుమారస్వామి, సంపత్, హరి ప్రసాద్, ప్రమోద్, మోహన్, మహేష్, కిరణ్, ఉద్యోగులు పాల్గొన్నారు.