గాంధీలో మూడు రోజుల సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపు సక్సెస్
గాంధీలో మూడు రోజుల సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపు సక్సెస్
* సిటీలోని వేలాది మందికి ఉచిత శిక్షణ
సికింద్రాబాద్, జనవరి 21 ( ప్రజామంటలు) :
గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్ని, గ్లోబల్ అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా గాంధీ లో కొనసాగుతున్న సీపీఆర్(కార్డియో ఫల్మనరీ రిస్యూసిటేషన్) పై ఉచిత శిక్షణ శిభిరం మంగళవారం నాటితో ముగిసింది. సిటీకి చెందిన ఇంజనీరింగ్, మెడికల్, ఇంటర్, డిగ్రీ,నర్సింగ్ స్టూడెంట్స్, పోలీసులు,అంబులెన్స్, ఆటో డ్రైవర్లు, తదితర రంగాల వారికి అత్యవసర సమయంలో గుండెపోటు వచ్చిన వారిని బ్రతికించడానికి ఎలా సీపీఆర్ చేయాలో థియరీ, ప్రాక్టికల్ గా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ అనంతరం సర్టిఫికెట్లను అందచేశారు. ఎన్ఎస్ఎస్ కేడేట్లు, కాలేజీ స్టూడెంట్స్ వాలంటీర్లుగా చేశారు. అలుమ్ని ప్రతినిధులు డా.రవీందర్ సురకంటి, డా.రాజశేఖర్ కొలిపార,డా.మహేశ్వర్ రెడ్డి, డెనిస్ మెకాలే( చికాగో), డా.జీఆర్ లింగమూర్తి, నర్సింహామూర్తి పాల్గొన్నారు.