లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ"కు ప్రధాని ఆహ్వానం - న్యూఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు ఇన్విటేషన్
లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ"కు ప్రధాని ఆహ్వానం
- న్యూఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు ఇన్విటేషన్
:సికింద్రాబాద్, జనవరి 21 ( ప్రజామంటలు):
న్యూఢిల్లీ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకావాలని సిటీకి చెందిన స్టూడెంట్ ఆకర్షణ కు ఇన్విటేషన్ అందింది. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఇన్విటేషన్ లెటర్, ఫ్లైట్ టిక్కెట్లు అందినట్లు ఆకర్షణ తండ్రి సతీష్ తెలిపారు. న్యూఢిల్లీ కర్తవ్య మార్గ్ లో జరిగే 76వ రిపబ్లిక్ డే వేడుకలకు తాము వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల రేడియోలో ప్రసారమైన మన్‌కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకర్షణ పేరు ప్రస్తావించి, రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వనించారన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆకర్షణ(13) ఇప్పటివరకు తన సొంత ఖర్చుతో పాటు సేకరించిన 12వేల పుస్తకాలతో 18 గ్రంధాలయాలను సిటీలోని అనాధాశ్రయాలు, ఏజ్డ్ ఫర్ ది హోమ్, దివ్యాంగ పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి గతంలో హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆకర్షణ ను పిలిపించుకొని, అభినందించారు. న్యూఢిల్లీ లోని రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకర్షణ పాల్గొనడం ఇది రెండవ సారి. కాగా జనవరి 26న హైదరాబాద్ రాజ్ భవన్ లో జరిగే రిపబ్లిక్ డే ఎట్ హోమ్ కార్యక్రమానికి రావాలని గవర్నర్ కార్యాలయం నుంచి కూడ ఆకర్షణకు ఇన్విటేషన్ అందినట్లు తండ్రి సతీష్ తెలిపారు.