తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 18 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతూ పాదయాత్ర
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఆశా వర్కల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్నో ఉద్యమాలు ధర్నాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించలేదని అందుగ్గాను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు. మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టామని తెలిపారు. ఇప్పటికైనా ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం
ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000, వేల రూపాయలు ఇచ్చే విధంగా నిర్ణయించాలని, అలాగే
ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు ఇందూరు సులోచన జిల్లాలోని ఆశలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.