అన్న ఎన్టీఆర్ కు తమ్ముళ్ళ ఘన నివాళులు
అన్న ఎన్టీఆర్ కు తమ్ముళ్ళ ఘన నివాళులు
* పద్మారావునగర్, సీతాఫల్మండిలో ఎన్టీఆర్ వర్ధంతి
సికింద్రాబాద్, జనవరి 18 ( ప్రజామంటలు):
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని శనివారం పద్మారావు నగర్ చౌరస్తా వద్ద ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది గంధం గురుమూర్తి, సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ వల్లారపు శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో శ్యామ్ రవి రాందాస్ కృష్ణ పాల్గొన్నారు.
సీతాఫల్మండి లో...
స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని సీతాఫల్మండి టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ జీవీ కృష్ణ ఆధ్వర్యంలో నామాలగుండ చౌరస్తా లో నిర్వహించారు. ఈసందర్బంగా సికింద్రాబాద్ టీడీపీ ఇంచార్జీ వల్లారపు శ్రీనివాస్, కృష్ణ లు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చిరంజీవి, రాజు, శశిరేఖ, చంద్రశేఖర్ పాల్గొన్నారు: