వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి
వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలనీ,వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదనీ,అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రియల్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలni కోరారు.
ఇంకా, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలి. వీటితోపాటు విలేజ్ మ్యాప్ ల ను పరిశీలించి అధికారులు ఫీల్డ్ కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకోవాలni కోరారు
వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదు.
రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలనీ సూచించారు.