నిర్మల్ పోలీస్ .. మీ పోలీస్ మానవ అక్రమ రవాణాకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ పోలీస్ .. మీ పోలీస్ మానవ అక్రమ రవాణాకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ జానకి షర్మిల
నవంబర్, 20 .
షీ టీం మానవ అక్రమ రవాణాకి సంబంధించిన పోస్టర్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆవిష్కరించారు.
ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, షీ టీం మరియు భరోసా సిబ్బంది కలసి లైంగిక వేదిపులు, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫోక్సో చట్టాల గురించి బాల్య వివాహాల గురించి, మానవ అక్రమ రవాణా, బాలలను అక్రమ రవాణా వంటి వివిద రకాల పోస్టర్ లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
షీటీమ్స్ బృందాలు మహిళలు, విద్యార్థుల భద్రత, రక్షణ కొరకు పనిచేస్తున్నాయని, ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురిచేసిన, మానసికంగా, శారీరకంగా హింసించిన, సోషల్ మీడియాలో ఫోటోలను మార్చి వేధింపులకు గురిచేసిన వారి వివరాలను షిటీమ్ పోలీసులకు సమాచారం ఇస్తే ఆకతాయిలను పట్టుకొని వారు మైనర్ గా ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వడం, మేజర్ గా అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.
స్కూల్లో, కాలేజీలలో, అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురిచేసినట్లూ అయితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, సూచించారు. ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫోక్సో చట్టాల గురించి బాల్య వివాహాల గురించి, మానవ అక్రమ రవాణా, బాలలను అక్రమ రవాణా, బాలలను అక్రమ దత్తత లాంటివి చేయకూడదని ఇలాంటి అక్రమ రవాణాలు జరిగినట్టు మీకు దృష్టికి వస్తే షిటీమ్ పోలీసులకు గాని, 100, 1098, కి డయల్ చేయాలని, జిల్లా షీటీం నం: 8712659550 కు సమాచారం అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ఆర్.ఎస్,ఐ లు వినోద్ , రవి కుమార్, షి టీం మరియు భరోసా మహిళా ఎస్ఐ సుమంజలి మరియు షి టీం మరియు భరోసా సిబ్బంది పాల్గొన్నారు.