ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల మంజూరి కృషి - పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కరీంనగర్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు) :
తన విద్యా సంస్థల్లో నిరుపేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం కరీంనగర్ మండలంలోని పలు విద్యాసంస్థల్లో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు.
రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... తెలంగాణ విద్యారంగంలో ఆల్ఫోర్స్ సంస్థలను స్థాపించి .. క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తూ లక్షలాది మంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా,భావి భారత పౌరులుగా తీర్చిదిద్ధి..తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను దక్కించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న తనను పట్టభద్రులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నాలుగు జిల్లాలు పర్యటించానని అన్ని వర్గాల నుండి తనకు సానుకూలంగా స్పందన వస్తుందని అన్నారు.
ప్రస్తుతం తాను ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వెల్లడించారు. నవంబర్ 6 లోపు ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు సులభతరం చేసేందుకు తాను మిస్డ్ కాల్ క్యాంపియన్ ద్వారా ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.. తాము కేటాయించిన నంబర్ కు మిస్డ్ కాల్ చేసినట్లయితే తమ సిబ్బంది నేరుగా వచ్చి ఓటు నమోదుకు సహకరిస్తారని అన్నారు.
నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తాను రాజకీయంలోకి వస్తున్నట్టు తెలిపారు.
గత కొన్నిసంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్టత సేవలు అందించారు.
ఎమ్మెల్సీగా గెలిస్తే వచ్చే డబ్బులను పట్టభద్రుల అభివృద్ధికి నిరుద్యోగ యువత కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారికి తోడ్పడుతానని ఇప్పటికే ప్రకటించారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు తప్పకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.