రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

On
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?

రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?

కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?

రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 

జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది

ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి

చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)

 

జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి  జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.   

 

సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల  జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.

 

డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ  వదనంతో  ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.

 

ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక  ప్రశ్నకు  జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ  దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది. 

 

అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే  రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.

 

ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.

 

జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా  మారిపోయింది.

 

మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి  రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది.  తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో  రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.

 

ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.

 

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ  నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.

Tags

More News...

Local News 

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం    మార్చి 31 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయిసప్తాహం ప్రారంభమైంది. ఈరోజు సోమవారం నుండి వచ్చే సోమవారం వరకు అఖండ సాయి నామ సప్తహం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. సన్నిధిలో ఒక వెయ్యి ఎనిమిది కలుశాలు స్థాపించి ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఎనిమిదో రోజు మళ్లీ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు  పోటీల్లో నిర్వహించారు ఈ పోటీల్లో 16 బండ్లు పాల్గొనగా విజేతలకు    బహుమతులు అందజేశారు మొదటి బహుమతి షేక్ అక్బర్ తిర్మలపూర్ కు బాయిన లక్ష్మి- లక్ష్మయ్య పావుతున్న బంగారం అందజేశారు, ద్వితీయ...
Read More...
Local News 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు  గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూరులోని  శ్రీరామలింగేశ్వర స్వామి  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామంలోని  ప్రధాన వీధుల గుండా  నిర్వహించిన రథోత్సవాన్ని చూడటానికి మండల నలుమూల గ్రామాల  భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

స్వయంభు గుండు మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మార్చి 31(ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి వారి దేవాలయాన్నీ సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు విప్ లక్ష్మణ్ కుమార్ కు శాలువాతో సన్మానించి స్వామి...
Read More...
International   Spiritual  

కెనడా - ఒంటారియో తెలుగు ఫౌండేషన్ టొరంటో లో ఘనంగా ఉగాది వేడుకలు

కెనడా - ఒంటారియో తెలుగు ఫౌండేషన్ టొరంటో లో ఘనంగా ఉగాది వేడుకలు .హైదరాబాద్ మార్చ్ 31:     కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (OTF) ఆధ్వర్యం లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు  టొరంటో లోని JCR ఆడిటోరియం అజాక్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈ వేడుకల్లో సుమారు వెయ్యికి పైగా తెలుగు కమ్యూనిటీ బంధుమిత్ర పరివారం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.    ఈ ఉగాది వేడుకలు...
Read More...
Local News 

ఏసీ, ఫ్రిడ్జ్ రిపేరింగ్ లో ఉచిత శిక్షణ

ఏసీ, ఫ్రిడ్జ్ రిపేరింగ్ లో ఉచిత శిక్షణ సికింద్రాబాద్,  మార్చి 31 ( ప్రజామంటలు):     పరీక్షలు రాసి, వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులకు సమయాన్ని సద్వినియోగం  చేసుకునేందుకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్. నరసింహమూర్తి తెలిపారు.ముషీరాబాద్ చౌరస్తా సమీపంలో, భోలక్ పూర్ వద్ద ఉన్న తమ శిక్షణ కేంద్రంలో 30 రోజుల పాటు ఇచ్చే...
Read More...
Local News 

శ్రీమల్లికార్జున స్వామి టెంపుల్ లో  ఉగాది ఉత్సవాలు

శ్రీమల్లికార్జున స్వామి టెంపుల్ లో  ఉగాది ఉత్సవాలు    బన్సీలాల్ పేట డివిజన్ భోలక్ పూర్ శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది లాగే ఈ సారి ఉగాది సందర్బంగా రెండు రోజుల పాటు  ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారికి 51 కలశాలతో అభిషేకం, పసుపుతో ఆలంకరణ,ఒగ్గుపూజారులతో పాలు వడ్డించుట, గంగా తెప్ప,పెద్ద పట్నం,అగ్నిగుండం ప్రవేశం, సూర్య...
Read More...
State News 

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 30 మార్చి (ప్రజా మంటలు) :  నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం మరియు శక్తిపీఠం గణపతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి...
Read More...
Local News 

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి ఢిల్లీ మార్చి 30(ప్రజా మంటలు)  తిమ్మంచర్ల గుంతకల్ ఎఫ్సిఐ గోడెన్ లో చాలా కాలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యపు ధాన్య నిలువల్ని తరలించి గోడన్ నీ ఖాళీ చేసి, మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గోడన్లని వాడుకునే విధంగా అనుమతి ఇప్పించగలరని కేంద్ర ఆహార భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో  పంచాంగ శ్రవణం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో    పంచాంగ శ్రవణం     గొల్లపల్లి మార్చి 30( ప్రజా మంటలు):    ఉగాది పండుగ పురస్కరించుకొని , జాగీతయాలలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో చిలుక ముక్కు నాగరాజు శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.     ఉదయం సత్సంగము అనంతరము, స్వామి సూర్య నారాయణ పల్లకి సేవ తదనంతరము ఉగాది పచ్చడి వితరణ  తరువాత దేవాలయము మహిళా కమిటి సభ్యులు మాత మణుల...
Read More...
Local News 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక     జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)వెలమ సంక్షేమ మండలి ఆద్వర్యం లో శ్రీ *విశ్వావసు నామ ఉగాది పంచాంగ శ్రవణం* ఆదివారం   సంఘం భవనంలో నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా సంజయ్ కుమార్  రాధిక .ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు రామచందర్ రావు, సంఘం అధ్యక్షులు అయిల్నేని...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                             

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                                  ఘనంగా స్వామివారి రథోత్సవం,    -స్వామి వారికి రథం ను బహుకరించిన మామిడి చిన్నయ్య పటేల్ వారసులు,      ఇబ్రహీంపట్నం మార్చి 30(ప్రజా మంటలు దగ్గుల అశోక్జ):    గిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఉగాది జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...