రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించడమే రాష్ట్ర విత్తనాబి సంస్థ లక్ష్యం - చైర్మన్ అన్వేష్ రెడ్డి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు) :
రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ లక్ష్యం దానిపై కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం నాడు జరిగిన జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సంఘాల కార్యదర్శులు మరియు వ్యవసాయ అధికారులతో జరిగిన సమావేశంలో విత్తన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్భంగా చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ..... రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యకలాపాలను ముమ్మరం చేయనట్టు ఆయన తెలిపారు. నాణ్యమైన విత్తనాలు అందించే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సహకార సంఘాలు ప్రోత్సహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత మాట్లాడుతూ రాష్ట్ర తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను ప్రాచుర్యం కల్పించాలన్నారు. వ్యవసాయ రంగంలో విత్తనాలదే కీలక భూమిక అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహకార అధికారి సి.హెచ్, మనోజ్ కుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థ అయినా తెలంగాణ సీడ్స్ విత్తనాలు రైతాంగానికి అందించడంలో సహకార సంఘాలు తోడ్పాటునందించాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న డి, సి, ఎం, ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాట్లాడుతూ టీఎస్ సీడ్స్ విత్తనాల విక్రయానికి డి.సీ. ఎం.ఎస్ లు తమ వంతు తోడ్పాటునందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, మరియు ప్రాథమిక వ్యవసాయ కార్యదర్శులు పాల్గొన్నారు.