బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి
స్వాతి ప్రియ. ఆత్మహత్య
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి
బాసర నవంబర్ 11:
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ రెండో ఇయర్ చదువుతోంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని పేరు స్వాతి ప్రియ. ఆమె సొంతూరు నిజామాబాద్‌లోని ఆర్మూర్ ప్రాంతానికి చెందినది గుర్తించారు
స్టూడెంట్ రూమ్‌లో సూసైడ్ నోట్ ఒకటి లభ్యమైంది. దాన్ని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని తెలిపిన ఆర్జియుకేటి అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
విద్యార్థిని కుటుంబ సభ్యులు వచ్చేవరకు వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం వీసీ గోవర్ధన్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ విషయం తెలియగానే వెంటనే ట్రిపుల్ ఐటీకి బయలుదేరారు.
విద్యార్థినికి సోమవారం ఉదయం పరీక్షలు ఉన్నాయి. పరీక్షల రోజే ఆత్మహత్యకు పాల్పడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మృతితో ట్రిపుల్ ఐటీలో విషాదఛాయలు అలుము కున్నాయి. ఈ విషయంను విద్యార్థిని కుటుంబ సభ్యులకు ట్రిపుల్ ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు.