పోలీస్ సిబ్బంది, అదికారులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
పోలీస్ సిబ్బంది, అదికారులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు) :
పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని , వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో జిల్లా పోలీస్ కార్యాలయ%శీ%లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ హాజరై పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్నారు జిల్లా ఎస్పీ ఈ వైద్య శిబిరంలో అధికారులకు,సిబ్బందికి నిపుణులైన వైద్యులతో వివిధ వైద్య సేవలు నిర్వహించడంతో పాటు, సిబ్బందికి వైద్యులు తగు సూచనలు, సలహాలను ఇచ్చారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే ఉండడం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ఇది చాలా అవసరం అని అన్నారు. హెల్త్ క్యాంపుకు సహకరించిన మెడికల్ హాస్పిటల్ డాక్టర్స్ కి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శిభిరంలో 300 మంది పోలీస్ సిబ్బంది,వారి కుటుంబ సభ్యులకి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో మొదలగు సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ భీం రావ్, డిఎస్పీలు రవీంధ్ర కుమార్, రఘు చందర్, ఉమా మహేశ్వర రావు, వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దిలీప్‌రెడ్డి, డాక్టర్ ప్రతిష్టారావు, డాక్టర్ అనీష్, డాక్టర్ తాహా, డాక్టర్ హర్షిత్, ఆర్.ఐ లు కిరణ్ కుమార్, రామక్రిష్ణ, వేణు, ఐటి కోర్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,రఫిక్ ఖాన్, పోలీస్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
ుుుుుుుు-