సౌదీ జైల్లో ఉన్న భర్త కొరకు భార్య దిగులు ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్రజావాణిలో ఫిర్యాదు
తండ్రికి తల కొరవి పెట్టడానికి నోచుకోని కొడుకు
తండ్రికి తల కొరవి పెట్టడానికి నోచుకోని కొడుకు
సౌదీ జైల్లో ఉన్న భర్త కొరకు భార్య దిగులు
ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్రజావాణిలో ఫిర్యాదు
హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు) : ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి, పొట్ట అచ్చేటపట్టుకొని సౌదీ అరేబియా వెళ్ళిన ఒరుపుల కొమురయ్య ఇప్పటికీ ఇల్లు చేరలేదు. కనీసం ఉత్తరం కానీ, ఫోన్ కానీ లేదని ఆయన భార్య ఒరుపుల మల్లమ్మ తల్లడిల్లుతుంది. తన భర్త, ఏదో తప్పుడు కేసు నమోదు చేసి, అక్కడి జైల్లో వేశారని, కనీసం తండ్రి చనిపోతే, తల కొరవి పెట్టడానికి కూడా రాలేకపోయాదని, ఇప్పటికైనా సవేశానికి రప్పించాలని ఆయన భార్య మల్లమ్మ, కొడుకు నరేష్ లు, తెలంగాణ ప్రజా భవన్ లో ఎన్నారై సెల్ టీపీసీసీ కన్వినర్ డా. షేక్ సంధ్ పాషా తో పాటు వచ్చి ఫిర్యాదు చేసింది.
ఇంటి నుండి 2011 లో వెళ్ళిన కొమురయ్య, సౌదీలో కాలు విరిగి బాదపడుతున్నట్లు తెలుస్తుందని, జైల్లో ఎందుకు వేశారో, ఏమి నేరం చేశాడో కూడా తెలియకుండా ఇక్కడ కుటుంబం అంతా ఆవేదన చెందుతున్నారని ఆమె తెలిపింది. ముసలితనంలో ఉన్న కొమురయ్య తల్లిని చూసుకోవడానికైనా అతన్ని తిరిగి రప్పించాలని ఆమె కోరుకొంటుంది.
--------------