మోడీ చైనా అధ్యక్షుడిని కలిశారు: 5 సంవత్సరాలలో మొదటిసారి
On
మోడీ చైనా అధ్యక్షుడిని కలిశారు: 5 సంవత్సరాలలో మొదటిసారి
న్యూ ఢిల్లీ అక్టోబర్ 24:
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు.
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ అధ్యక్షుడిని కలుసుకుని మాట్లాడారు. సదస్సు రెండో రోజున ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడితో సమావేశమయ్యారు. సరిహద్దులో మిలిటరీ పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరిన తరుణంలో ఈ భేటీ జరిగింది.
ఈ భేటీలో ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు ఒప్పందం సహా ముఖ్యమైన అంశాలపై చర్చించారు. సరిహద్దులో ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో ఇరువురు నేతల మధ్య సమావేశం జరగలేదు. ఐదేళ్ల తర్వాత వీరిద్దరూ తొలిసారి కలుసుకోవడం గమనార్హం.
Tags