భూమి ఒకరిది - అప్పు మరొకరికి  -బ్యాంకుల మాయాజాలం 

తన పేరిట 20 లక్షలు బ్యాంకులో లోన్ తీసుకున్న వ్యక్తిపై చర్యలకు ప్రజావాణిలో ఫిర్యాదు

On
భూమి ఒకరిది - అప్పు మరొకరికి  -బ్యాంకుల మాయాజాలం 

భూమి ఒకరిది - అప్పు మరొకరికి- బ్యాంకుల మాయాజాలం      తన పేరిట 20 లక్షలు బ్యాంకులో లోన్ తీసుకున్న వ్యక్తిపై చర్యలకు ప్రజావాణిలో ఫిర్యాదు

బుగ్గారం అక్టోబర్ 21 (ప్రజా మంటలు)

మండలం మద్దూనురు గ్రామానికి చెందిన ముంజల నారాయణ (44) అనే వ్యక్తి క్రాప్ లోన్ నిమిత్తము జగిత్యాల పట్టణంలోని కెనరా బ్యాంకుకు వెళ్లగా ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇదివరకే ఇతని పేరు మీద మరొకరు 20 లక్షల లోన్ తీసుకున్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. విచారణ చేయగా  ఆధార్ కార్డు లోని పేరు డేట్ అఫ్ బర్త్, తండ్రి పేరు, ఆధార్ కార్డు నెంబరు ఇతనిది ఉండగా, అడ్రస్ ఫోటో మాత్రము మరొకరి ఆధార్ కార్డు పెట్టి లోన్ తీసుకోన్నారని తేలింది.  ఏం చేయాలో అర్థం అర్థం కాని పరిస్థితిలో, జగిత్యాల ప్రజావాణి లో ఫిర్యాదు చేసాడు.

 తరచూ బ్యాంకు నుండి లోన్ కట్టమని ఫోన్ లు రావడంతో  మానసింగా  కృంగిపోతున్నానని  తెలుపుతూ వెంటనే తనకు న్యాయం చేయాలని తన పేరుపై ఎవరైతే లోన్ డబ్బులు 20 లక్షలు తీసుకున్నారో వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడు కోరుతున్నాడు.

----------------

Tags