చింతకుంట చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే డా సంజయ్.

On
చింతకుంట చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే డా సంజయ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు) : 

మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లో భాగంగా జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యం లో జగిత్యాల పట్టణ చింత కుంట చెరువు వద్ద హాజరై చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. 

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ...

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ద్యేయంగా ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తానని పునరుద్ఘాటించారు.

చింత కుంట చెరువు లో 2 లక్షల చేప పిల్లలు విడుదల చేయటం జరిగిందన్నారు.

జగిత్యాల నియోజకవర్గం లో 155 చెరువుల్లో 20 లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టామని గంగపుత్రులు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

గంగ పుత్రులు సమస్యల పరిష్కారం కోసం ఎల్లపుడూ కృషి చేస్తానన్నారు.మత్స్య పారిశ్రామిక సంఘం లో మహిళలు భాగస్వామ్యం పెరగాలన్నారు.

20 లక్షలతో రైతు బజార్ లో చేపల మార్కెట్ అభివృద్ధి చేశామని తెలిపారు. రైతు బజార్ నేడు హోల్ సెల్ మార్కెట్ కు అడ్డాగా మారిందని

జగిత్యాల బీట్ బజార్ లో 4 కోట్ల తో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు.

వెజ్ నాన్ వేజ్ మార్కెట్ తో జగిత్యాల ప్రజలకు మత్స్య కారులకు లాభదాయకమన్నారు.

రోడ్ల పై మాంసం,చేపల విక్రయం ఆరోగ్య దాయకం కాదన్నారు.

మార్కెట్ ల విజయవంతానికి అందరూ కలిసి కృషి చేయాలి.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ,జిల్లా మత్స్య శాఖ అధికారి,మున్సిపల్ కమిషనర్ చిరంజీవి,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,జిల్లా సంఘం అద్యక్షులు ప్రవీణ్, పట్టణసంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య,కౌన్సిలర్ లు బాలే లత శంకర్,పద్మ పవన్, జుంభర్తీ రాజ్ కుమార్,పాంబాల రాంకుమార్, క్యాధసు నవీన్,పాక్స్ డైరెక్టర్ ఆరుముల్ల గంగారం, బాల ముకుందం, జుంభర్తీ శంకర్, గంగాపుత్ర సంఘం సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags