ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు కు ఉద్యోగుల, ప్రైవేట్ పాఠశాల మద్దతు.

ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు  వివిధ జిల్లాల్లో విస్తృత పర్యటన

On
ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు కు ఉద్యోగుల, ప్రైవేట్ పాఠశాల మద్దతు.

ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు కు ఉద్యోగుల, ప్రైవేట్ పాఠశాల మద్దతు.             వివిధ జిల్లాల్లో విస్తృత పర్యటన

మంచిర్యాల అక్టోబర్ 20 :ప్రజా మంటలు) :

  ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్,  పెంచికల్ పేట్,  కౌటాల,  సిర్పూర్, బెజ్జూరు తదితర మండలాల్లోనూ;  కాగజ్ నగర్ పట్టణంలోనూ  తదితర ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్,  నిజామాబాద్,  మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు విస్తృతంగా పర్యటించారు.

IMG-20241019-WA0097

 ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్లు తదితర ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు, పట్టభద్రులు శేఖర్ రావును కలిసి,  అనేక రకాల సమస్యలను వివరించారు.
  ముఖ్యంగా సిర్పూర్ పేపర్ మిల్లు విడుదల చేసినటువంటి విషవాయువుల వల్ల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు పూర్తిగా కలుషితమై పోయాయి. ఇప్పుడు ఆ పరిశ్రమ నడవక పోయినప్పటికీ, అప్పటి కాలుష్యం వల్ల ఏర్పడిన అనారోగ్యాల,  అంగవైకల్యాల వల్ల ఇంకా కూడా జనాలు బాధలు పడుతున్నారని తెలిపారు.
 అయితే ఆ పేపర్ మిల్లులో ఉన్నటువంటి గ్రౌండ్లో వాకింగ్ చేసుకుంటామంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి అక్కడి సిబ్బంది అనుమతి ఇవ్వకుండా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

IMG-20241020-WA0517
 నిజానికి వారి వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులని దిగమింగుకొని కూడా ఈ ప్రాంత వాసులు వారికి ఎంతో సపోర్ట్ చేసినప్పటికీ,  వారు మాత్రం కనీసం గ్రౌండ్లో ఉదయమే ఆరోగ్యం కోసం నడక నడిస్తే దానికి కూడా అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు.
 వీటిపై శేఖర్ రావు  మాట్లాడుతూ వారి  ప్రతి యొక్క సమస్యని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
 అక్కడి పట్టభద్రులు, పుర ప్రముఖులు స్థానికులు మేము సైతం శేఖర్ రావుతో అని నినాదాలు చేశారు. తమ సంపూర్ణమైన మద్దతును ప్రకటించారు.

IMG-20241019-WA0099

ఆ తర్వాత అనేక ప్రైవేటు విద్యాసంస్థలను, ప్రభుత్వ గురుకులాలను,  మోడల్ స్కూల్ లను కలిసి అక్కడ ఉన్నటువంటి బోధన, బోధనేతర సిబ్బంది తోటి వారి సమస్యల గురించి చర్చించారు.


 ముఖ్యంగా ఉద్యోగస్తులకి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

 అలాగే ఫీజు రీయంబర్స్మెంట్ విషయములో అనేక రకాలైన ఇబ్బందులని యాజమాన్యాలు ఎదుర్కొంటున్నాయని, విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందక వారు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు.
 మరి అటు యాజమాన్యాలకు,  ఇటు విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్స్ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్నటువంటి బోధన, బోధనేతర సిబ్బందికి 10 లక్షల రూపాయల ఆరోగ్య భీమా మరియు జీవిత బీమా వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోటి చర్చించి చర్చిస్తానని తెలియజేశారు.

 అంతేకాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తో పాటు,  ప్రతి సంవత్సరం జాబ్ కాలండర్స్ వచ్చే విధంగా, త్వరితగతిన ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోటి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

   ఇప్పటివరకు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో తమ ఓటుని నమోదు చేసుకోలేదో వారిని వెంటనే నమోదు చేసుకోవాలని, 
తనకి తమ  సంపూర్ణ మద్దతుని అందించాలని కోరారు.

 ప్రతీ ఒక్కరు కూడా కలిసిన ప్రతీ చోట కూడా *మేము సైతం శేఖర్ రావు తో* అని నినాదాలు చేస్తూ, ఉత్సాహంగా పాల్గొన్నారు.
తమ సంపూర్ణ మద్దతుని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్,  నిజామాబాద్,  అదిలాబాద్, కరీంనగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు తో పాటు
 పెద్దపల్లి కిషన్ రావు   (ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ), ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు దేవ భూషణం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, కోశాధికారి రాజేంద్రప్రసాద్,  వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవరావు, చారీ  జాయింట్ సెక్రటరీ, రోహన్ బరాయి,  సంజయ్ సింగ్ మరియు ఆసిఫాబాద్ జిల్లా ట్రస్మా బాధ్యలు, మీడియా ప్రతినిధులు పుర ప్రముఖులు పట్టభద్రులు స్థానికులు వేలాది మంది పాల్గొన్నారు.

Tags