జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!
జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!
- వందల కోట్లు నిధులు పట్టణ అభివృద్ధికి కేటాయించిన
- నాసిరక పనులతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..!
- పత్రికలో వరుస కథనాలు ఇస్తున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే..!
- జమ్మికుంట మున్సిపాలిటీలో పట్టణ నడిబొడ్డున పరిస్థితి ఇది..!
- ఇక వార్డుల సంగతి దేవుడెరుగు
- ద్విచక్ర వాహనం లేని నాయకులు నేడు ఇన్నోవా, థార్ లలో తిరుగుతున్న పరిస్థితి
జమ్మికుంట (ప్రజా మంటలు) 26 : వందల కోట్ల రూపాయలు జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి పరిస్థితి అవుపడుతున్నది. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది, వర్షం పడితే మన పాలకవర్గం పనితీరు బయటపడుతుంది, తినడానికి తిండికి లేనివారు నాయకులుగా ఎదిగి ఇన్నోవాలు, మహేంద్ర తార్ వాహనాలు వాడుతున్నారు అంటే వాళ్లు ప్రజాసేవలో ఎంత నిమగ్నమయ్యారో మనకు అర్థమవుతుంది. చినుకు పడితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిస్థితి చిత్తడి గానే మారుతుంది. పట్టించుకున్న నాధుడే లేడు, జమ్మికుంట గురించి పత్రికల్లో వరుస కథనాలు రాస్తున్నప్పటికీ " ఎవడికి పుట్టినావు బిడ్డ అంటే ఎక్కి ఎక్కి ఏడ్చినట్టు ఉంది " అస్సలు మున్సిపల్ పాలకవర్గంలో, అధికారుల్లో చలనమే లేకుండా పోతుంది జమ్మికుంట నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగానే విపరీతమైన రోడ్లకు గుంతలు పడి రోడ్ యాక్సిడెంట్లు అవుతూ ప్రజలు ప్రమాద బారిన పడుతున్నప్పటికీ అస్సలు పట్టించుకున్న నాథుడే లేడు, ఎన్నో మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా మాకేం పని అన్నట్టు ఉంది పరిస్థితి, ఇప్పటికైనా జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలారా మనం పడుతున్నటువంటి అవస్థలు మీరు చూస్తూనే ఉన్నారు, కౌన్సిలర్ లు చైర్మన్లు ఏ స్థాయిలో వాళ్ల వ్యక్తిగత ఎదుగుదల జరిగిందో మన కళ్ళ ముందు అగుపడుతున్న సాక్ష్యం ఇది, పట్టణ అభివృద్ధి పక్కకు పెట్టి గెలిపించిన ఓటర్ల కష్టాలను పట్టించుకోకుండా వ్యక్తిగత అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ప్రజలారా మన ఇబ్బందులు పట్టించుకోని ఈ నాయకులకు రానున్న ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితే తప్ప వీరు మన ప్రజల్ని పట్టించుకోరు అని ప్రజలు భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
