జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు
ఈరోజు సాయంత్రం 6గం .లకు రవీంద్రభారతిలో ప్రధానం
జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు - ఈ రోజే రవీంద్రభారతిలో ప్రధానం
హైదారాబాద్ జూలై 22:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం పేరును ఎంపిక చేసింది. సోమవారం సాయంత్రం 6గం.లకు రవీంద్రభారతి ప్రధాన హాల్ లో ముఖ్యమంత్రి అవార్డు ప్రధానం చేస్తారు.
కృష్ణమాచార్య జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక "శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు" 2024 సంవత్సరానికి ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. రచయిత జూకంటి జగన్నాథంకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందిన జూకంటికి ఈ అవార్డు రావడం జిల్లా కవులకు, రచయితలకు అందరికీ గౌరవం దక్కినట్లేనని, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపుగా భావిస్తున్నట్లు జిల్లా కవులు సంతోషిస్తున్నారు
కవి, రచయిత, కథకుడు జూకంటి జగన్నాథం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగేళ్లపల్లి మండలానికి చెందిన వారు. మూడు దశాబ్దాలుగా జూకంటి కవితా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 11 పురస్కారాలు పొందారు. జూకంటికి దాశరథి అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు పురస్కారం అందించనున్నారు.