ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడి కేంద్రం సందర్శన
ఆకస్మికంగా జిల్లా కలెక్టర్
అంగన్వాడి కేంద్రం సందర్శన
మెట్ పల్లి జులై 2 (ప్రజా మంటలు) :
మేట్ పల్లి లోని 4 వ అంగన్ వాడి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సంద్భంగా అంగని వాడి కేంద్రంలోని రికార్డులు పరిశీలించారు, భోజన నమోదు లు, టైం టేబుల్, భోజన మెనూ, ఫుడ్, స్టాక్, అంతేకాకుండా అంగన్ వాడి లో ఇచ్చే గుడ్డు నాణ్యత ను స్వయంగా పరిశీలించారు,మరియు ప్రి స్కూల్ పిల్లల హాజరు, గర్భిణిలు, బాలింతల హాజరు నమోదు లు , ఎం హెచ్ టి ఎస్ మొబైల్ యాప్ లో పరిశీలించారు.
అంతే కాకుండా అంగనీ వాడి కేంద్రములో ఉన్న పిల్లల,ఎత్తుల,బరువులు స్వయంగా పరిశీలించారు. ఎన్ హెచ్ టి ఎస్ మొబైల్ యాప్ లో, లోప పోషణ ఉన్న పిల్లలు ఎవరు ఉన్నారో యాప్ లో చెక్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల పెరుగుదల పర్యవేక్షణ నివేదికల గురించి అడిగారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ ను క్రమంగా చేపట్టి ఖచ్చితమైన పిల్లల ఎత్తులు, బరువులు నమోదు చేయాలని సర్వే లోని తేడాలు ఉండరాదని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు, మరియు గ్రామాలలో ,గ్రామ పంచాయితి సిబ్బంది అంగన్ వాడి కేంద్రాలను పర్యవేక్షణా చేపట్టి ప్రి స్కూల్ పిల్లల విద్య, పెరుగుదల పర్యవేక్షణ చేపట్టి , ఖచ్చితమైన నివేదికలు సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా సంక్షేమ అధికారి వాణి శ్రీ , ఆర్ డి ఓ, మున్సిపల్ కమిషనర్, ఎం ఆర్ ఓ ,పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధు కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
