జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

- కొప్పుల రాజ్ కుమార్ చావుకు డిఎంహెచ్ ఓ నే బాధ్యుడు.

On
జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు )

 

జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ ఎస్.వినోద్ కుమార్ లకు మృతుడు కొప్పుల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు మాట్లాడుతూ....

జగిత్యాల జిల్లా కేంద్రంలోని 104 లో డ్రైవర్ గా పని చేసే కొప్పుల రాజ్ కుమార్ (56) అనే వ్యక్తి ఇటీవల మృతి చెందడానికి డిఎంహెచ్ ఓ పుప్పాల శ్రీధర్ తలపెట్టిన పని ఒత్తిడే కారణం అని వారు ఆరోపించారు. ఎలాంటి విరామం లేకుండా పని చెపుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వల్లనే కొప్పుల రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారని వారు వివరించారు.

జగిత్యాల పట్టణ పోలీసులు డిఎంహెచ్ ఓ శ్రీధర్ పై పలు సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల వారు తీవ్రంగా మండి పడ్డారు. అంతే కాకుండా హాండిసి పెటేడ్ బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్పడం సిగ్గు చేటన్నారు.

సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారిక సమావేశాలలో పాల్గొన్న పుప్పాల శ్రీధర్ ను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

పోలీసులు ముద్దాయికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే డిఎం హెచ్ ఓ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలన్నారు. 

మృతుడి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ... రూ.50 లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సెలవులో వెళ్ళిన డిఎం హెచ్ వో.

జగిత్యాల డిఎం హెచ్ వో పుప్పాల శ్రీధర్ ఈ నెల 15 నుండి 30 తేది వరకు అనారోగ్య కారణాల వలన సెలవులో వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డా.శమియోద్దీన్ ను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags