నర్సింగ్ లెక్చరర్ పోస్టులలో మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు అవకాశం ఇవ్వాలి
నర్సింగ్ లెక్చరర్ పోస్టులలో మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు అవకాశం ఇవ్వాలి
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు): నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో మేల్ నర్సింగ్ అధికారులకు అవకాశం కల్పించాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండుగుల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శ్రీవాణి కి ఈ మేరకు వినతి పత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నర్సింగ్ ఆఫీసర్లుగా ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్సీ నర్సింగ్ పూర్తిచేసిన మగ నర్సింగ్ ఆఫీసర్లకు నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో కేవలం మహిళ నర్సింగ్ ఆఫీసర్లను భర్తీ చేసే విధంగా పాత జీవోలు ఉన్నాయని, వాటిని సవరించి రానున్న ప్రమోషన్ల భర్తీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన మగ నర్సింగ్ అధికారులకు కూడా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఈ జీవోను సవరించి అమలుపరచడం జరిగిందని తెలంగాణలో కూడా వెంటనే జీవన సవరించి మేలు నర్సింగ్ ఆఫీసర్లు కూడా ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని, ఇందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కే వేణుగోపాల్ గౌడ్, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాపోలు శేఖర్, కోర్ర వినోద్, రవి కుమార్ నేనావత్, బి రవి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన
