కేసీఆర్ కు, పార్టీ కార్యకర్తలకు వారిధిగా ఉంటాను - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మోసం చేయడం కాంగ్రెస్ నైజం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి
- ఎమ్మెల్సీ కవిత
భద్రాచలం ఏప్రిల్ 21:
బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారుల సమావేశంలో కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి నేను తీసుకెళ్తాను,ఏ చిన్న అవసరమున్నా నన్ను కార్యకర్తలు సంప్రదించవచ్చునని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తాను.తెలంగాణను కాపాడడమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యం.కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని ఆమె అన్నారు.
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు తేలేదు. ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్.మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది.
అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విపరీతమైన అబద్దాలు చెబుతున్నారు.2004లో చచ్చిన పీనుగలా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. 2004లోనే తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పదేళ్లు ప్రజలను ఏడిపించింది.
వందలాది మంది బిడ్డలను పొట్టనపెట్టుకొని తెలంగాణ ఇచ్చారు తప్పా ఉట్టిగా ఇవ్వలేదు.లక్షా 60 వేల కోట్లుపైగా అప్పు తెచ్చిన సర్కారును ప్రశ్నిస్తే బుకాయిస్తున్నారు.తెచ్చిన రుణాన్ని ఏం చేశారని అడిగితే చెప్పబోమని చెబుతున్నారు
తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.40 వేల కోట్ల విలువైన భూములను 10 వేల కోట్లకు ప్రభుత్వం తాకట్టు పెట్టింది
ఆ 10 వేల కోట్లతో రైతు భరోసా, రుణ మాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు.కానీ ఇప్పటికీ 60 శాతం మందికి రుణ మాఫీ కాలేదు, 50 శాతం మందికి రైతు భరోసా రాలేదు. మరి ఈ 10 వేల కోట్లు ఎక్కడ పోయినట్లు ?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి
ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ వ్యక్తుల్లా ఉంటారు... కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీ అనేక కల్లిబొల్లి మాటలు చెప్పింది.. లేనిపోని హామీ ఇచ్చింది.అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు.అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ ది
రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కేసీఆర్ పని చేశారు.సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారు
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష.తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లా నుంచి.1969లో ఖమ్మంలో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రమంతా పాకింది
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ద్రోహి.భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదే.అలాంటి ద్రోహులను చాలా చూశాం... కుట్రలను చూశాం
బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమరపాటుగా ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేస్తుంది,మోసపోతే గోస పడుతారని కేసీఆర్ పదే పదే అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వాలిబాల్ వేసవి ఉచిత శిక్షణ శిబిరం ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచ్ తాండ్ర పవన్
1.jpeg)
నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్

మండు టెండలో రోడ్డుపై పాకుతూ.. కూటి కోసం ఓ యాచకుడి నరకయాతన

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేత

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ రెండవ విలన్ బి ఆర్ ఎస్.

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
