త్రాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి - ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 11:
ప్రత్యేక దృష్టి సారించి, తగు జాగ్రత్తలు తీసుకో గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ధర్మపురి మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నూతన వాటర్ ట్యాంకర్లను ప్రారంభించి కమలాపూర్ ఇందిరమ్మ కాలనిలో నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన, చిల్డ్రన్స్ పార్కులను పరిశీలించి, అమృత్ నల్లా పైప్ లైన్ పనులను ప్రారంభించి జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...
తలపున గోదావరి ఉన్నా , గత ప్రభుత్వంలో ధర్మపురి మున్సిపాలిటీలో మంచినీటి సరఫరాకు ఎక్కడో ఉన్న డబ్బా నుండి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయడం జరిగిందని, కానీ తాను గెలిచిన వెంటనే జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో ధర్మపురి మున్సిపల్ లో త్రాగునీటి శాశ్వత పరిష్కారం కోసం సమావేశమై చర్చించడం జరిగిందని వివరించారు. డబ్బాలో మోటార్ల నిర్వహణ సరిగా లేక నీటి సరఫరా ఆగిపోతే మొదట ఇబ్బంది జరిగేది ధర్మపురికే, కనుక దాని నిర్వహణకు కొత్త మోటార్ల కొనుగోలుకు కోటి రూపాయల ప్రపోజల్స్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపండం జరిగిందని తెలిపారు.
మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు బోలి చెరువు వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ధర్మపురి ప్రాంతానికి నీటిని ఇచ్చే ఆలోచన చేసినప్పటికీ, గత పాలకులు మిషన్ భగీరథ పథకం పేరున దాన్ని పక్కకు పెట్టడం జరిగిందని, ధర్మపురి మున్సిపల్ లో గాని ధర్మపురి నియోజకవర్గంలో గానీ త్రాగు నీటికి ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, దాని కొరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
