ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

On
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

 అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి చాలా ప్రమాదం. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్.
బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, దళిత వ్యతిరేకత

బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముంది ?

దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత టికారాం జుల్లి  శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారని, అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరం
 
ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాలి
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష

హైదరాబాద్  ఏప్రిల్ 08:

కంచా గచ్చిబౌలి భూముల విషయంలో చాలా ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫోటోలు రూపొందించారని ఆరోపిస్తూ కేసులు పెట్టడానికి ఉపక్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని విమర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని ధ్వజమెత్తారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని, అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ అని,  అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు ఇందిరా పార్కు వద్ద దీక్ష చేశారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా ఈ దీక్షా కార్యక్రమానికి వేలాది మంది బీసీలు, ప్రజలు తరలివచ్చారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.... దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష సాగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత టికారాం జుల్లి  శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారని, అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరమన్నారు. బీజేపీపాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి చేతల్లో చూపించాలని సూచించారు. అయోధ్య రాముడి గుడి కడితే బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముంది ? అని ప్రశ్నించారు. బాన్సువాడ ప్రాంతంలో ఒక చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉండడం దారుణమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికీ అవమానాలు జరుగుతున్నాయని, ఇవి సమాజానికి మంచిది కాదని, వీటిని రూపుమాపడానికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన రెండు బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైందని, ఆ బిల్లులు గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా... లేదా రాష్ట్రపతికి పంపించారా ? అని అడిగారు. ఆ బిల్లులను ఆమోదించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారని, కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని చెప్పారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేదని, బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని విమర్శించారు. దానికి బదులు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని, ధర్నాకు రాహుల్ గాంధఈ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాము కూడా కలిసి వస్తామని, కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని స్పష్టం చేశారు.

IMG-20250408-WA0023

దేశంలో ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగిపోయిందని, కాబట్టి  50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించినా కోర్టులు అడ్డుకోలేవని,  ఈ రీత్యా బీసీ బిల్లుల ఆమోదానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీసీలను మభ్యపెట్టవద్దు...రెండు బిల్లులను ఆమోదించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీ డీఎన్ఏ నే బీసీలకు, దళితులకు వ్యతిరేకమని ధ్వజమెత్తారు. అటువంటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలే మనకు మార్గమని అన్నారు.

 

కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు ? అని ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని, తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదని ప్రస్తావించారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలని అన్నారు. కులగణనపై అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడవద్దని స్వతంత్ర అధ్యయన కమిటి హెచ్చరించిందని, మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి అని నిలదీశారు. చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు.

కాగా, ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారని, మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలేని కీర్తించారు. కులవివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని చెప్పారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.

ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాహిత్య అకాడెమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ , మాజీ బీసీ కమిషన్ మెంబెర్ కిషోర్ గౌడ్ , టీఎస్పీఎస్సీ మాజీ మెంబెర్ సుమిత్ర తనోబా, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహ , నివేదిత సాయన్న, ఆశిష్ యాదవ్ , బిఆర్యస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు సామాల హేమ , సునీత , సరస్వతి ఆలకుంట హరి, లలిత యాదవ్ , బిఆర్యస్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ రవీ యాదవ్ , సీనియర్ నాయకులు రోషన్ బాలు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామ్ చందర్ రావు , కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, అలకుంటల హరి , హమాలీ శ్రీను ,కొట్టాల యాదగిరి ,ఎత్తరి మారయ్య,  గోపు సదనందు, విజేందర్ సాగర్ ,రాచమల్ల బాలకృష్ణ , సురేందర్, డి కుమారస్వామి , కోల శ్రీనివాస్ , నిమ్మల వీరన్న , మురళి , సాల్వాచారి, శ్రీహరి, డి నరేష్ కుమార్ , జంగమ పరమేశ్వరి, గురం శ్రవణ్, ఏల్చాల దత్తాత్రేయ, రామ్ కోటి, గొరిగే నర్సింహ , అశోక్ యాదవ్ ,లింగం శాలివాహన  , పుష్ప చారి , మధు ,విజయ్ జితేంద్ర , కృష్ణమ చారి, గోవర్ధన్ యాదవ్ , నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి , శ్రీధర్ రావు, ప్రశాంత్ అనంతుల, మారేపల్లి మాధవి , అర్చన సేనాపతి , భాస్కర్ యాదవ్ , సంపత్ గౌడ్, అప్పల నరేంద్ర యాదవ్ , పసుల చరణ్, ఈగ సంతోష్ , పెంట రాజేష్ , నవీన్ గౌడ్ , రాము యాదవ్ , మనోజ్ గౌడ్ , ప్రవీణ్ ముదిరాజ్ , అభిలాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం..  కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ..  బిజెపి నాయకురాలు రాజేశ్వరి. సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని...
Read More...
State News 

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

  కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్ జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు హైదరాబాద్ ఏప్రిల్ 18: మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక  ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ...
Read More...
Local News 

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు.  రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎర్ధండి...
Read More...
Local News 

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం సీతాఫల్మండిలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్ ఏప్రిల్ 18 ( ప్రజామంటలు) : దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి, అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ  చెప్పాలని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు సికింద్రాబాద్, ఏప్రిల్ 18 ( ప్రజామంటలు): సికింద్రాబాద్ లో శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కేజేఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్ధనలు చేశారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్,శైలా పాల్ లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో...
Read More...
Opinion 

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ. మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్  కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ...
Read More...
State News 

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

విడిసి చొరవతో... రాలిన పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...? గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 18: గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత...
Read More...
Local News 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు  గొల్లపల్లి ఎప్రిల్ 18 (ప్రజా మంటలు): శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం  యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం  మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమ ర్పం చారు కుంకుమ...
Read More...
Local News 

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది *సేవలో తరిస్తున్న వాసవి మహిళ సంఘం ఎంతో  గ్రేట్..    *విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ సరోజ వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): ఫ్యాషన్ వల్లే  మనం ఏదైనా సాధించ గలుగుతామని. అలాగే వాసవి మహిళా సంఘం నిర్వాహకులు  నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటు, తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ, డా.అంబేడ్కర్...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని చందోలి, బొంకూరు, వెనుగుమట్ల, లోత్తునూరు,వెంగళపూర్, శంకర్రావుపేట్ గ్రామాల్లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్  గురువారం రోజు ప్రారంభించారు.ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలలో రైతులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను...
Read More...
Local News 

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ    సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు): అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో  ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్...
Read More...
Local News 

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు విజయం సాధించిన డా.సుభోద్, డా.రాజేశ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన రెండు జనరల్ కౌన్సిల్ మెంబర్ (ఒకటి ప్రొఫెసర్ క్యాడర్, మరొకటి అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ) పోస్టులకు గురువారం గాంధీ ఆసుపత్రిలో ఎన్నికలు జరిగాయి. ఉదయం...
Read More...