అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకై రేపు ఎమ్మెల్సీ కవిత దీక్ష
ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ దీక్ష
ఏర్పాట్లను పరిశీలించిన జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు
హైదరాబాద్ ఏప్రిల్ 07:
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
దీనికి సంబంధించి సోమవారం నాడు తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ నేతృత్వంలో నాయకులు ఇందిరా పార్కు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
బీసీల ఆత్మ బంధువు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చాలా కాలం నుంచి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్న విషయం విధితమే. పలు సార్లు ధర్నాలు, దీక్షలు నిర్వహించడమే కాకుండా విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతపై పలు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను రెండు సార్లు కలిసి వినతి పత్రాలు కూడా అందించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో పోరాటాన్ని ఉదృతం చేశారు. ఈ నెల 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం విగ్రహం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఇందిరా పార్కు వద్ద బొళ్ల శివ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ, బీసీల విషయంలో ప్రభుత్వం చిన్న చూపు తగదని సూచించారు. బీసీల ఆరాధ్య దైవమైన పూలేను చట్టసభల ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ను ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. బీసీల అంశాలు, సమస్యలపై అనేక జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించామని, వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరించారు. బీసీలను మోసం చేస్తూ సహించేదే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత దీక్షకు వేలాది మంది ప్రజలు, బీసీలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు నవీన్ ఆచారి , శ్రీధర్ రావు, పెంటా రాజేష్ , యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ నాయకులు అలకుంటల హరి, గోపు సదనందు, మారయ్య, నిమ్మల వీరన్న, విజేందర్ సాగర్ , డి నరేష్ కుమార్, అశోక్ యాదవ్ , లింగం శాలివాహన , పుష్ప చారి తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
