ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
గొల్లపల్లి ఎప్రిల్ 07 (ప్రజా మంటలు):
సైద్ధాంతిక నిబద్ధతతో క్రియాశీల రాజకీయాలు నెరుపుతూ ప్రజల మన్ననలు పొంది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని ధర్మపురి నియోజకవర్గ మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం పేర్కొన్నారు
గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూర్ గ్రామంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొక్కు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
ఇట్టి కార్యక్రమంలో కస్తూరి సత్యం మాట్లాడుతూ గత 45 సంవత్సరాల క్రితం 1980 ఏప్రిల్ 6 వ తారీఖున దేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అంత్యోదయ సిద్ధాంత ప్రాతిపదికన ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత పారదర్శకత పాలనతోదేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు నాడు దివంగత ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారి వాజ్ పాయ్ గారు సుపరి పాలనకు బాటలు వేస్తే నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తుందని చెప్పారు రాబోవు రోజుల్లో యువత మహిళల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు భీమ మహేష్ పార్టీ కార్యదర్శిలు సాయిని రాజు సంకటి గంగారాజం శక్తి కేంద్రం ఇన్చార్జీలు రాఘవరెడ్డి ఎలేటి లింగారెడ్డి సాంబారి శ్రీనివాస్ దూస ప్రశాంత్ పార్టీ సీనియర్ నాయకులు పాదం మహేష్ పటేల్ గడ్డి పోశయ్య ఉష్కమల్ల సత్యం మోర పెళ్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
