దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం..... అదనపు కలెక్టర్ బి. ఎస్ లత.
జగిత్యాల, ఏప్రిల్ -03( ప్రజా మంటలు)
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ బి. ఎస్. లత తెలిపారు.
గురువారం అదనపు కలెక్టర్ బి. ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 98వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. ఎస్ లత దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ బి. ఎస్ లత మాట్లాడుతూ,* దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క అని,నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని , ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
మహనీయులను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సునీత, బిసి మరియు ఎస్సీ సంఘ అధ్యక్షులు జిల్లా అధికారులు, కలెక్టరెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్
.jpg)
చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి
.jpg)
మహాంకాళి ఠాణాలో కోఆర్డినేషన్ మీటింగ్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
