చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు
వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు
సికింద్రాబాద్ ఏప్రిల్ 10 (ప్రజామంటలు) :
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనలు నడిపిన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు హెచ్చరించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎల్.మధు బాబు తో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజు మాట్లాడుతూ, ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా మైనర్లు వాహనాలు నడపడం పై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించామన్నారు.ఉత్తర మండలం పరిధిలో 109 కేసు లు నమోదైనట్లు వెల్లడించారు.వీరిలో మైనర్లు అత్యధికంగా ఉన్నారని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈసందర్భంగా గుర్తు చేశారు.
మోటారు వాహన చట్టం 1988 సెక్షన్ 180 ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి నందు కాను వెయ్యి రూపాయల జరిమాన తో పాటు మూడు నెలల జైలు శిక్ష, లేదా ఈ రెండు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.సెక్షన్ 181 ప్రకారం డ్రైవింగ్ చేసే వాహనదారుడు వయస్సు సరిపోకపోతే 500 రూపాయల జరిమాన లేదా మూడు నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది, సెక్షన్ 207 ప్రకారం వాహనానికి రిజిస్ట్రేషన్, పర్మిట్ లేకుండా నడిపితే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇక మైనర్లు తప్పు చేస్తే సెక్షన్ 199ఏ 2019 ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు అవుతుందని, ఆ వాహనదారుడు కి 25 ఏళ్లు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం లేదన్నారు. మైనర్లు వాహనాలను నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు.
మైనర్ల తల్లిదండ్రులకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిల్లిగ్ నిర్వహించారు. అనంతరం చట్టాల పై అవగాహన కల్పించారు.చట్టాన్ని గౌరవిద్దాం, నియమాలకు లోబడి వాహనాలు నడుపుదాం అంటూ తల్లిదండ్రులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.ఉత్తర మండలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి బోయిన్ పల్లి 17, తిరుమలగిరి 19, మరేడ్ పల్లి 23, బేగంపేట 24,గోపాలపురం09, మహంకాళీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదైనట్లు జి.శంకర్ రాజ్ వెల్లడించారు. ఈకార్యక్రమంలో మైనర్ పిల్లల వారి తల్లిదండ్రులు,ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర
