ధాన్యం సేకరణ చిత్త శుద్ది తో యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత
జగిత్యాల మార్చి 27(ప్రజా మంటలు)
జగిత్యాల: జిల్లాలో రానున్న రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను ఒక యజ్ఞంల చిత్తశుద్ధిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ఉద్భోదించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం సేకరణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు తేకుండా వ్యవసాయ అధికారులు చూడాలన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటించాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహకార అధికారి సి.హెచ్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలదే కీలకపాత్ర అన్నారు. పౌరసరఫరాల శాఖ సూచనల ప్రకారమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ రైతులు తెచ్చే ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలను నిర్ధారించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జితేందర్ ప్రసాద్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు వివరాలను తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి, సహకార, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ, రవాణా, లీగల్ మెట్రలజి అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
