ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ గ్రౌండింగ్ పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేసుకోవాలి. బీర్పూర్, సారంగాపూర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించిన.... జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల మార్చి 24(ప్రజా మంటలు)
మంగళవారం రోజున బీర్పూర్ మండల కేంద్రంలోని పీహెచ్ హెల్త్ సబ్ సెంటర్,బీర్పూర్ మండలం చిత్రవేణి గూడెం గ్రామంలో ఇదిరమ్మ ఇండ్లు, తాళ్ళ ధర్మారం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ,కొల్వాయి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్,సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లి హెల్త్ సబ్ సెంటర్ పలు నిర్మాణ దశలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
బీర్పూర్ మండల కేంద్రంలో 1 కోటి 43 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ మరియు తాళ్ల ధర్మారం గ్రామంలో 20 లక్షల వ్యయంతో సబ్ సెంటర్ మరియు కొల్వాయి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షల వ్యయంతో మరియు సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో 20 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు నిర్మాణ దశలో ఉన్న పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు.
సారంగాపూర్ మండలంలో నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ రెండు నెలల లోపు పూర్తి చేయాలని అలాగే తాళ్ల ధర్మారంలో హెల్త్ సబ్ సెంటర్ పనులను ఏప్రిల్ నెల చివరి వరకు పూర్తిచేయాలని అన్నారు. మరియు కొల్వాయి గ్రామం సబ్ సెంటర్ పనులను 20 రోజుల్లో లోపు పూర్తిచేయాలని లక్ష్మీదేవి పల్లిలోని గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ పనులను ఏప్రిల్ నెల చివరి నాటికి నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం బీర్పూర్ మండలం చిత్రవేణి గూడెం గ్రామంలోని పలు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ స్థలాల పనుల పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం మాత్రమే నిర్మించుకోవాలని నిర్మించుకున్న వారికి మాత్రమే దశలవారీగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అవుతాయని కలెక్టర్ తెలిపారు.
ఇండ్ల నిర్మాణ దశలో ఉన్న పనుల వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ వెంట డిపిఓ మధన్ మోహన్, డిఈ మిలిండు హౌసింగ్ డిఈ, ఎమ్మార్వో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
