జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ..... తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి
జగిత్యాల మార్చ్ 24:
జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . భారీ ఈదురు గాలులు, వడగండ్లు, అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న, వరి, నువ్వు, కూరగాయలు, తదితర పంటలు నెలకోరిగి దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాల కారణంగా దెబ్బ తినడంతో రైతులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారనీ శేర్ నర్సారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అధికార యంత్రాంగం వెంటనే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిపి పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసి రైతులకు తగిన నష్టపరిహారం అందేలా తగు చర్యలు తీసుకోని ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
