రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రదేశాలను సందర్శించిన ధర్మపురి సి.ఐ రామ్ నరసింహా రెడ్డి
గొల్లపల్లి మార్చి 23 (ప్రజా మంటలు)
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సురక్షిత ప్రయాణం కార్యక్రమం భాగంగా ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్) లను సందర్శించి మున్సిపల్, ఆర్ అండ్ బి, హైవే అథారిటీలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ప్రజల విలువైన ప్రాణాలు కాపాడాలని ఆదేశించారు.ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు.
స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కోసం తగిన సూచనలు చేశారు.ఈ చర్యలు రోడ్ ప్రమాదాలను తగ్గించడానికి, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి తీసుకుంటున్నామని సురక్షిత ప్రయాణం కార్యక్రమం ప్రజల రోడ్ భద్రతను మెరుగుపరిచేలా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా సి.ఐ వాహనాలు నడిపే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు
డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి – మొబైల్ ఫోన్ వాడకూడదు, దృష్టి మరలకుండా జాగ్రత్తపడాలి.
ఈ సూచనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించుకోవచ్చని, ప్రయాణం సురక్షితంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఎస్.ఐ సతీష్, బుగ్గారం ఎస్ఐ ఎం. శ్రీధర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
