రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు నశించాలి*
*
జగిత్యాల మార్చి 6( ప్రజా మంటలు)
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా బోగ శ్రావణి*
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు మరియు విద్యార్థి వ్యతిరేక విధానానికి నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ
జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డుకుంటున్న మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు విద్యా పరంగా ప్రయోజనం కలిగేలా జవహర్ నవోదయ విద్యాలయాన్ని జక్రాన్‌పల్లి మండలం కలీగోట్ వద్ద భూకేటాయింపు జరగాలని జిల్లా కలెక్టర్ ని ఆయన కోరారు. అయితే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ షుగర్ ఫ్యాక్టరీకు చెందిన కేవలం 8 ఎకరాల భూమిలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్మాణం జరపాలని ప్రతిపాదనలు పంపించారు.
నవోదయ విద్యాలయ స్థాపనకు కనీసం 30 ఎకరాల భూమి అవసరం ఉండగా, కేవలం 8 ఎకరాలు మాత్రమే ఇచ్చి, విద్యాలయ ఆమోదానికి అడ్డుతగిలే సుదర్శన్ రెడ్డి నవోదయ విద్యాలయం శాంక్షన్ కాకుండా అభివృద్ధికి నిరంతరం అడ్డుపడుతున్నా రని
అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి కమిటీ వేయడం జరిగింది కానీ అప్పుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే పునరుద్ధరణ చేపడతామని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బుద్ధి తక్కువగా వ్యవహరిస్తున్నారు.
ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఉమ్మడి ఆధీనంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను ఏ విధంగా నవోదయ స్కూల్ కి కేటాయిస్తారు వాళ్లు బుద్ధి తెచ్చుకొని ఆలోచించాలి నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి కేంద్ర బిందువు అయిన షుగర్ ఫ్యాక్టరీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కి ఎసరు పెట్టారు దాని సబ్ సెంటర్ అయినా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అంతే అని చెప్పకనే చెప్పారు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు కమిటీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి నిజం షుగర్ ఫ్యాక్టరీలు ఎప్పుడు పున ప్రారంభిస్తారు ఇప్పటికిప్పుడే ప్రకటించాలి అదేవిధంగా నవోదయ విద్యాలయానికి వెంటనే స్థలాన్ని కేటాయించాలి లేకపోతే ఈ అసమర్థపు పాలన చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గద్దె దిగిపోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మాట్లాడుతూ...
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు, విద్యా సంస్థలు మంజూరు చేస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిని సంకుచిత ఆలోచనలతో అడ్డుకుంటోంది.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నలువల తిరుపతి, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, BJYM రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్,పిల్లి శ్రీనివాస్, జగిత్యాల్ నియోజకవర్గం మరియు ధర్మపురి నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు జిల్లా మండల పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
