ఘనంగా ముగిసిన ధర్మపురి బ్రహ్మోత్సవాలు

On
ఘనంగా ముగిసిన ధర్మపురి బ్రహ్మోత్సవాలు


( రామ కిష్టయ్య సంగన భట్ల)

సుప్రసిద్ధ పుణ్యక్షే త్రమైన ధర్మపురిలో దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 10 నుండి 22వ తేది వరకు 13రోజుల పాటు నిర్వహించిన శ్రీలక్ష్మీనర సింహ (యోగానంద, ఉగ్ర), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శని వారం అర్ధరాత్రితో ఘనంగా ముగిసాయి. సంపూర్ణంగా సమిష్టి కృషితో జయప్రదమైనాయి. మార్చి 11వ తేదీన కళ్యాణోత్సవం, మార్చి 14,15,16 తేదీలలో కోనేరులో యోగా నంద, ఉగ్ర నారసింహ, వేంకటేశ్వరుల తెప్పోత్సవ, డోలోత్సవాలు, 19న రథో త్సవం, 20,21, 22 తేదీలలో మువ్వురు  స్వాముల ఏకాంతోత్సవ వేడుకల ప్రధాన కార్యక్రమాలకు రాష్ట్రేతర సుదూర ప్రాంతాలనుండి అశేష భక్త, యాత్రిక జనం ఏతెంచి, కార్యక్రమాలలో భాగస్వాములై మొక్కులు తీర్చుకున్నారు.

కార్యక్రమాల విజయవంతానికి, భక్తులకు వలసిన సదుపాయాల కల్పనకు, సౌకర్యాల మెరుగుదలకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార, ఉద్యోగ వర్గాలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవాసంస్థల బాధ్యులు సంపూర్ణ సహకారాన్ని అందించి ప్రశంసాపాతృ లైనారు. వివిధ ఆర్టీసీ డిపోలు వ్యూహాత్మకంగా, భక్తుల రద్దీకి అనుగుణంగా, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రత్యేక బస్సులను నడిపాయి. పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయాలు చోటుచేసు కోకుండా పకడ్బందీ బందో బస్తు చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంతరాలు కలుగ కుండా విద్యుత్శాఖ సమయోచిత చర్యలు తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలను నిర్వహించింది.

పారిశుద్ధ్య సౌకర్యాల ఏర్పాట్లలో స్థానిక పురపాలక సంఘం పక్షాన మున్నెన్నడూ లేనట్టి ప్రత్యేక శ్రద్ధ కనబరచి, క్షేత్రంలో చెత్త చెదారం పేరుకుపోకుండా, అంటు రోగాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టింది. సాంస్కృతిక కార్యక్రమాలలో వివిధ కళాకారులను, వాద్యకారులను రప్పించి, నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవస్థానం పక్షాన  బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతల చేయూతతో ఏర్పాటు చేసిన నిత్యాన్న కార్యక్రమం, క్షేత్రానికి అరుదెంచిన వేలాది భక్తులకు, యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడింది. అన్నదాన కార్యక్రమ సక్రమ నిర్వహణకు సేవాభావంతో స్థానిక చైతన్య భారతి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలకు చెందిన నేషనల్ గ్రీన్ కోర్ విద్యార్థులు, ఆర్యవైశ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకు బాష్యం చెప్పారు.IMG-20250323-WA0011

బ్రాహ్మణ నిత్యాన్న సత్రం, గాయత్రీ నిత్యాన్న సత్రం, 
అన్నపూర్ణ సేవా సమితి, ఆర్య వైశ్య నిత్యాన్న సత్రం,  ఆర్యవైశ్య సంఘం, స్థానిక విప్రుల గృహాలలో వసతులు, భోజన, త్రాగునీటి సౌకర్యాలు కల్పించి, భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా తమవంతు కృషి సల్పారు. వివిధ ఛానళ్ళ ద్వారా ప్రసారం గావించి, దేశ విదేశాలలో స్వాముల ఉత్సవాలను ప్రత్యక్షంగా చూసే సద వకాశాన్ని కలిగించి, ప్రశంసాపాతృలైనారు.

దేవస్థానం సిబ్బంది, స్థానిక వేద పండితులు, కళాకారులు వివిధ స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అంకిత భావంతో, అలుపెరుగక, అవిశ్రాంత సేవలందించారని, దేవాదాయ శాఖాధికారులు మార్గ నిర్దేశం చేశారని, క్షేత్ర, దేవస్థాన పౌరోహి తులు, వేదపండితులు, వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్థానిక దైవ కార్యానురక్తులు, మీడియాను దేవస్థానం ఈఓ శ్రీనివాస్,  కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు ప్రశంసించి, ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

Tags

More News...

Local News 

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నిరుపేదలకు...
Read More...
Local News 

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు   జగిత్యాల ఏప్రిల్ 01: బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు  తరలివెళ్లారు. ఈ...
Read More...
Local News 

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు  ప్రథమ స్థానంలో  దొనకొండ.సుధీర్ శకల్ల గారి పావుతుల బంగారం మూస్క్ నిశాంతిరెడ్డి అందజేశారు   ధ్వితిమ స్థానంలో క్యతం.జితేందర్ జగదేవ్ పేట,  వారికి 10గ్రా వెండి కీర్తిశేషులు దాసరి లచ్చవ్వ -భీమయ్య...
Read More...
Local News 

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని *15 ఏండ్లుగా ప్రతి వేసవిలో అన్నదానం, చలివేంద్రం   *ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్    సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :    వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని...
Read More...
Local News 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య  గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఎనగందుల జయంతి 25 సం డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నది. జయంతి గత కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో  మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో,  రూమ్ లో ఐరన్...
Read More...
Local News 

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య. గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)      గొల్లపల్లి మండలము లోని గోవింద పల్లె గ్రామానికి చెందిన  చెందిన బింగి వెంకటమ్మ 72 సం వృద్ధురాలు కొంతకాలం నుండి  థైరాయిడ్  షుగర్ సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ  20 రోజుల క్రితం వెంకటమ్మకు కడుపులో నొప్పి రాగా, కొడుకు
Read More...
Local News 

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ సికింద్రాబాద్, ఏప్రిల్ 01 ( ప్రజామంటలు ) :    అసలే పేదరికం..ఆపై అనారోగ్య సమస్యలు..శరీరం సహకరించక మద్యలోనే చదువు ఆపేసిన  యువతికి ఓ సంస్థ అండగా నిలిచింది. వివరాలు ఇవి..బన్సీలాల్ పేట డివిజన్ జయనగర్ కు చెందిన డి.దశరథ్, వాణీ ల కుమార్తె పూజిత(17) డయాబెటిక్, థైరాయిడ్ తో బాధపడుతోంది. తన మూడేండ్ల వయస్సు నుంచే...
Read More...

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం  జగిత్యాల ఏప్రిల్ 1( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత ఐదు వారాలుగా ప్రతి మంగళవారం జరుగుతున్న సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఈ  మంగళవారం ఐదో వారము కు చేరింది.  ఈనాటి హనుమాన్ చాలీసా పారాయణoలో భక్తులు  విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు...
Read More...
Local News 

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే...
Read More...
Local News 

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం    మార్చి 31 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయిసప్తాహం ప్రారంభమైంది. ఈరోజు సోమవారం నుండి వచ్చే సోమవారం వరకు అఖండ సాయి నామ సప్తహం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. సన్నిధిలో ఒక వెయ్యి ఎనిమిది కలుశాలు స్థాపించి ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఎనిమిదో రోజు మళ్లీ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు  పోటీల్లో నిర్వహించారు ఈ పోటీల్లో 16 బండ్లు పాల్గొనగా విజేతలకు    బహుమతులు అందజేశారు మొదటి బహుమతి షేక్ అక్బర్ తిర్మలపూర్ కు బాయిన లక్ష్మి- లక్ష్మయ్య పావుతున్న బంగారం అందజేశారు, ద్వితీయ...
Read More...
Local News 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు  గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూరులోని  శ్రీరామలింగేశ్వర స్వామి  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామంలోని  ప్రధాన వీధుల గుండా  నిర్వహించిన రథోత్సవాన్ని చూడటానికి మండల నలుమూల గ్రామాల  భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ...
Read More...