పరమ పుణ్యప్రదం ... అన్నదాన మహా దానం
బ్రహ్మోత్సవాలలో వేలాది మందికి ఉచిత భోజనం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
"గజ తురగ సహస్రం, గోకులం కోటి దానం, కనక రజత పత్రం, మేతిని సాగరంతం, ఉపాయ కుల విషుత్తం కోటి కన్యా ప్రదానం, నహీ నహీ బహు దానం అన్నదానం సమానం"...
ఒక వ్యక్తి వెయ్యి ఏనుగులను, గుర్రాలను కానుకగా ఇచ్చినా లేదా కోటి ఆవులను, ఎన్ని వెండి మరియు బంగారాన్ని కానుకగా ఇచ్చినా, సముద్రం వరకు మొత్తం భూమిని కానుకగా ఇచ్చినా, వంశం యొక్క మొత్తం సేవలను అందించి, కోటి స్త్రీల వివాహానికి సహాయం చేసినా, అన్నదానంతో సమానం కావు.
హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కంటే మంచి పూజ గానీ మరొక ఆచారం లేదని భావన. అన్నదానం అనేది మహాదానం., అన్నం అంటే ఆహారం, 'దానం' అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. అన్న దానాన్ని వివిధ రకాల దానంలో 'మహాదానం' అంటారు. ఇది సనాతన ధర్మ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు “అన్నాద్ భవన్తి భూతాని". ఆహారం సమస్త సృష్టిని పోషిస్తుందని అర్థం. ఒక వ్యక్తి ఆకలిని తీర్చడం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచ లేక పోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచ వచ్చును. ఎందుకంటే ఒకపూట భోజనం పెట్టి ఇతరుల కడుపు వెంటనే నింపొచ్చు.
ఈ భావనతోనే ధర్మపురి క్షేత్రంలో ఏటా సాంప్రదాయ రీతిలో 13రోజులపాటు నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్తానం పక్షాన దాతల సహకారంతో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఏడు దేవస్తానం ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో, జక్కు రవీందర్ నేతృత్వంలోని ధర్మ కర్తల మండలి ఆధ్వర్యంలో , ఉద్యోగుల, స్థానిక రైస్ మిల్లర్ల, వర్తక వాణిజ్య వ్యాపార వేత్తలు, భక్తుల సహకారంతో, నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కొనసాగించారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు
అలాగే అన్నపూర్ణ సేవా సమితి కన్వీనర్ పెద్దంభట్ల పెద్ద నరేందర్ మార్గదర్శకత్వంలో భక్తులకు చల్లని త్రాగునీరు, లస్సీ అందించారు. నిత్యాన్న దాన సత్రం అధ్యక్షులు కొరిడే దత్తాత్రి, కార్యదర్శి అంబరీష చారి, సభ్యుల
నిర్వహణలో పులిహోర పంచి పెట్టారు.
గోదావరి నది స్నానాలు దైవ దర్శనానికి వచ్చే భక్తులు, డెప్యూటెషన్ లపై విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు, భారీ బందోబస్తు ఏర్పాటు కోసం నియమితులయ్యే పొలీసులు రుచికరమైన అన్నం, సాంబారు, కూరలు, పచ్చడి, మజ్జిగ తో కమ్మని భోజనం చేసి ఆకలి తీర్చుకుని ఆనందంగా నిర్వాహకులను అభినందిస్తూ తిరిగి వెళుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
