స్కందగిరిలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా..
* ఫిల్లర్లను కూల్చిన సిబ్బంది
* రోడ్డును కబ్జా చేసిన మాజీ మున్సిపల్ ఉద్యోగి
సికింద్రాబాద్ మార్చి 21 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలోని పద్మారావునగర్ స్కందగిరి ప్రాంతంలో ఓ రోడ్డును కబ్జా చేసి భవనం కట్టేందుకు యత్నించిన జీహెచ్మెమ్సీ మాజీ ఉద్యోగి నిర్వాకం ఇది. హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..1986 లో స్కందగిరి ప్రాంతంలో కొత్తగా ఇండ్లు నిర్మించేందుకు గాను లే అవుట్ ప్రకారంగా కాలనీ వాసులు స్టలాలు కొనుగోలు చేసి, ఇండ్లు కట్టుకున్నారు. అయితే అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ఓ ఉద్యోగి కాలనీలో లే అవుట్ ప్రకారం ఉన్న రహదారిపై 1991 లో ఫిల్లర్ల నిర్మాణం చేశాడు. ఆ పక్కన మరో వ్యక్తి ఏకంగా ఓ భవనాన్ని నిర్మించాడు. స్థానిక అపార్ట్ మెంట్ వాసులు చాలా ఏండ్లుగా ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు.
కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిరిగిన స్థానికులు చివరికి ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. కబ్జా దారుడు మాజీ మున్సిపల్ ఉద్యోగి అయినందునే ఇంతకాలం తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నార్త్ జోన్ జీహెచ్ఎమ్సీ అధికారులు పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. ఎట్టకేలకు స్థానికుల ఫిర్యాదు కు స్పందించిన హైడ్రా అధికారులు శుక్రవారం స్కందగిరి ప్రాంతానికి వచ్చి, వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న రోడ్డు స్థలంలో నిర్మించిన సిమెంట్,కాంక్రీట్ ఫిల్లర్లను కూల్చివేశారు.
ఇదే దారిపై ఉన్న ఓ అపార్ట్ మెంట్ కు నోటీసులు ఇచ్చామని, దానిపై కూడ చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా సీఐ ఆదిత్య, బేగంపేట జీహెచ్ఎమ్సీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, డీసీపీ సుస్మిత, చైన్మెన్లు జగదీష్, భూషన్,సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
