కుటుంబ సమేతంగా అంజన్నను దర్శించుకొన్న తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్
గొల్లపల్లి (కొండగట్టు) ఫిబ్రవరి 01 ప్రజా మంటలు
కుటుంబ సమేతంగా అంజన్నను దర్శించుకొన్న తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ ను ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికినారు.స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు.ముందుగా కొండగట్టుకు విచ్చేసిన డిజిపిని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. అనంతరం సాయిదబలగాలచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ జిల్లా యొక్క స్థితిగతులు, శాంతిభద్రతల గురించి జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.వీరి వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్, డిఎస్పీ రఘు చందర్,ఆర్ ఐ కిరణ్ కుమార్,మల్యాల సి.ఐ రవి ఎస్.ఐలు సతీష్ ,రవికుమార్ ఉన్నారు