విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
సికింద్రాబాద్, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):
ముదిరాజ్ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... జనాభాలో అధిక జనసంఖ్య కలిగిన ముదిరాజ్ కమ్యూనిటీని ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంక్ గా వాడుకొని వదిలేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైన ముదిరాజ్ ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముదిరాజ్ లను వెంటనే బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన ఉస్మానియా యూనివర్శిటీ డాక్టర్ శివ ముదిరాజ్ను ముదిరాజ్ నాయకులు అభినందించారు. సమావేశంలో యు.నారాయణ ముదిరాజ్, ప్రొఫెసర్ యాదగిరి, చంద్రశేఖర్, పొట్లకాయల వెంకటేశ్వర్లు, కోట్ల పుష్పలత పాల్గొన్నారు.