శ్రీలలిత డెడ్ బాడీకి గాంధీ లో పోస్టుమార్టం పూర్తి..
శ్రీలలిత డెడ్ బాడీకి గాంధీ లో పోస్టుమార్టం పూర్తి..
* కూతుర్ల నుంచి సూసైడ్ లేఖ స్వాధీనం
* అనుమానస్పద మృతిగా కేసు నమోదు
సికింద్రాబాద్ ఫిబ్రవరి 01 (ప్రజామంటలు):
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్దనగర్ లో 9 రోజుల క్రితం చనిపోయిన శ్రీలలిత డెడ్ బాడికి శనివారం గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం చేశారు. అనంతరం డెడ్ బాడిని ఆమె సోదరుడు రమేశ్, ఇద్దరు కూతుర్లు రవళిక, అశ్విత లకు అప్పగించినట్లు వారాసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు, అడ్మిన్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
శ్రీలలిత ది అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టు మార్టం ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. శ్రీలలిత అంత్యక్రియలను దోమల గూడ లో నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా జనవరి 22న రాత్రి తల్లి శ్రీలలిత చనిపోయిన తర్వాత మరుసటి రోజు డిఫ్రెషన్ లోకి వెళ్లిపోయిన కూతుర్లు రవళిక, అశ్విత లు సూసైడ్ చేసుకునేందుకు నిర్ణయించుకొని, తర్వాత ధైర్యం చాలక ఆ ప్రయత్నం మానుకొన్నారు.
ఆ సమయంలో వారు రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ అమ్మ శ్రీలలిత తో పాటు తమ ఆత్మహత్యలకు ఐదుగురు వ్యక్తులు కారణమంటూ వారి పేర్లు, ఫోన్ నెంబర్లతో కూతుర్లు రవళిక, అశ్విత లు సూసైడ్ లెటర్ రాశారు. తమ తండ్రి సీఎల్ రాజు తో పాటు మేనమామ, మరో ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో కోరారు. తండ్రి మిస్సింగ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.
స్థానికులు కొందరు బ్లాక్ మేజిక్ చేసి అమ్మను చంపారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే తాము డిప్రెషన్ లో ఆ లేఖ రాశామని రవళిక, అశ్విత చెప్పినట్లు పోలీసులు తెలిపారు.