ఒడిదుడుకుల్లో బడ్జెట్ - విద్య, వైద్యం, నిరుద్యోగులకు నిరాశే
ఒడిదుడుకుల్లో బడ్జెట్ - విద్య, వైద్యం, నిరుద్యోగులకు నిరాశే
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజామంటలు);
రైతులకు, మధ్య తరగతి వ్యాపారస్తులకు అనుకూలమైన బడ్జెట్, కానీ మహిళల సాధికారతకు, విద్యార్థునుల చదువు, భవిష్యతు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించలేదు, నిధులను కేటాయించ లేదు, దేశంలో నిరుద్యోగుల సంఖ్య బాగా విపరీతంగా పెరిగింది యువతకు స్వయం ఉపాధి పొందేలా చర్యలు, ప్రణాళికలు లేవు, నిధులు కేటాయింపు లేదు, క్రీడా రంగాన్ని విస్మరించారు, ఇంకా ముఖ్యంగా దేశంలో ఆకలితో మరణిస్తున్నవాళ్ళ సంఖ్య, నిరాశ్రయుల సంఖ్య చాల పెరిగిపోయింది. నివారణ చర్యలు చెపటేలా ప్రత్యేక శాఖను కేటాయించలేదు. ఆర్థిక నేరాల విషయంలో చాల కేసులు పెండింగ్ లోనే ఉంటునాయి. నష్టపోయినవాళ్లకు సత్వర న్యాయం జరగడంలేదు, కేసులను పరిష్కరించే దిశగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కావలసిన నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. బడ్జెట్ అంకెలు భారీగా ఆకర్షణీయంగా ఉన్నాయి, ఆచరణలో సాధ్యం చేసినప్పుడే లక్ష్యాలను నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది.
-డాక్టర్. వై. సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్,
స్కై ఫౌండేషన్.