వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
మల్కాపూర్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
మల్కాపూర్ లోని శ్రీ లక్ష్మీ హోమ్స్ లో వసంత పంచమి పర్వదిన కాలాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన చేశారు..
మయూరగిరి పీఠాధిపతులు, జ్యోతిష్య - వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీ నమిలకొండ రమణచారి స్వామి వారి ఆధ్వర్యంలో ఉదయం నుండి పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు.
భక్తుల హనుమాన్ చాలీసా పారాయణం రామనామంతో భజనలతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగింది. సకల దోషాలను తొలగించేవాడు సకల ఐశ్వర్యాలను అందించేవాడు ఆంజనేయ స్వామి అని భక్తులను ఉద్దేశించి రమణాచార్యులు తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురమళ్ళ శ్రీనివాస్, సుడా చైర్మన్ కొమిటి రెడ్డి నరేందర్ రెడ్డి మల్కాపూర్ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు పండితులు రామకృష్ణమాచార్యులు వినయ్ కుమారాచార్యులు పండితులు పాల్గొన్నారు. నిర్వాహకులు బుర్ర శరత్ బృందం ఆలయ కమిటీ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేసి అన్నదానాన్ని నిర్వహించారు. పలు ప్రాంతం నుండి వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆశీర్వచనాలు పొందారు.