కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి
కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి
గోమా ఫిబ్రవరి 02:
తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అతిపెద్ద నగరమైన గోమాలో ఆదివారం జరిగిన తీవ్ర పోరాటంలో కనీసం 700 మంది మరణించారని UN తెలిపింది. రువాండా మద్దతు ఉన్న M23 తిరుగుబాటుదారులు ఉత్తర కివు ప్రావిన్స్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో 2,800 మంది గాయపడ్డారని UN ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ తెలిపారు.
ఖనిజాలు అధికంగా ఉండే కాంగోపై నియంత్రణ కోసం పోరాడుతున్న వందలాది వర్గ సమూహాలలో M23 ఒకటి. గోమా నగరం మరియు దాని పరిసర ప్రాంతాల్లో కేవలం ఒక వారంలో M23 జరిపిన దాడిలో 773 మంది వరకు మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
అంతే కాకుండా, గోమా మరియు దాని పరిసర ప్రాంతాల నుండి 8 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.కాంగోలో దాదాపు 25,000 మంది భారతీయులు ఉండగా, వీరిలో సుమారు వెయ్యి మంది గోమాలో నివసిస్తున్నారు. అయితే భారతీయులందరినీ సురక్షిత ప్రదేశాల్లో ఉంచినట్లు విదేశీ వ్యవహారా మంత్రిత్వ శాఖ తెలిపింది.