మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్
మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్
ధర్మపురి ఫిబ్రవరి 02:
ధర్మపురి మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్, వెనిక్కి పంపివేశారు
స్వయంగా ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల ప్రిన్సిపాల్ తొ మాట్లాడినా ఆయన వీలుకాదని చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,ధర్మపురి పట్టణం కేంద్రంలో మైనార్టీ గురుకుల కళాశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్ పాయిజన్ తొ అస్వస్థత గురైన ఐదుగురు విద్యార్థిని లను కలిపి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కళాశాలకు వెల్లడంతొ, గేటుకు తాళం వేసి అడ్డుకొన్నడం అప్రజాస్వామికం అని అన్నారు
కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు ఉంచితంగా ఒక నాణ్యమైన విద్య ను అందించాలని ఉద్దేశ్యం తో ఆనాడు ఈ రెసిడెన్షియల్ వ్యవస్థ ను బలోపేతం చేయడం తో పాటు దాదాపు ఒక వెయ్యి పైచిలుకు గురుకుల పాఠశాలను స్థాపించిన సంగతి అందిరికీ తెలుసన్నారు..!
కానీ ఈ రోజు దురదృష్టకరం ఏమిటంటే రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలు, కళాశాలల్లో ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తమైన పరిస్థితి, నిర్వాహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పారు..!
గురుకుల పాఠశాలల్లో భోజనం బాగా లేదని, పాములు వస్తున్నాయి, ఎలుకలు కురుస్తున్నాయి, తినే ఆహారంలో బల్లులు పడి విద్యార్థులు ఆసుపత్రిలో పలు కావడం జరిగిందని అన్నారు
రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయని, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం గురుకుల పాఠశాలలో పాము కాటు వేసి ఓ విద్యార్థి మరణించడం జరిగిందని, మళ్ళీ అదే గురుకుల పుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు..!
ఇప్పటికే రాష్ట్రంలో 57 మంది గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు.
గతంలో చదువుకు దూరమైన వర్గాలు చదువుకు దూరంగా ఉండొద్దు అని, అన్ని వర్గాలకు సమానంగా విద్యను అందించాలని, కెసిఆర్ ఈ రెసిడెన్షియల్ స్కూల్ లను తీర్చిదిద్దడం జరిగిందని, కాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసి ఓ ప్రయత్నం జరుగుతోంది ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు..?
కెసిఆర్ ఆనవాళ్లు అంటే గురుకుల పాఠశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, కెసిఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, పండుగల సందర్భంగా పేద ప్రజలకు దుస్తుల పంపిణీ ఇవ్వన్నీ కెసిఆర్ ఆనవాళ్లే ఇవన్నీ కనుమరుగు చేయడం జరుగుతుంది, అందులో భాగంగానే ఉద్దేశ్యం పూర్వకంగానే గురుకుల పాఠశాలలో సౌకర్యాలు బాగాలేవని, పిల్లలు చనిపోతున్నారని, కాబట్టి పిల్లలను గురుకులకు పంపొద్దని ఒక అభిప్రాయాని తల్లిదండ్రులకు వచ్చే పరిస్థితికి కావాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.!
గత సంవత్సరం తో పోల్చుకుంటే గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్ధుల అడ్మిషన్ శాతం తగ్గిందని, కెసిఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ల కోసం పోటీ ఉండేది, రాష్ట్రంలో 40 వేల అడ్మిషన్ లు ఉంటే, 4 లక్షల అప్లికేషన్ లు వచ్చేవని గుర్తు చేశారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గురుకుల పాఠశాలలో చేరే వారి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది, దానికి కారణం ఈ ప్రభుత్వం తల్లిదండ్రులు వారి పిల్లలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు..!
ఈ రోజు గురుకుల పాఠశాల వ్యవస్థ ఒక అనాధ వ్యవస్థల తయారు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఇవన్నీ చూసి విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనసులు చెదిరిపోయినవని ఆవేదన వ్యక్తం చేశారు
రెండు రోజుల క్రితం ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాలలో భోజనం వికటించి 5 విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు,
స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తే తప్ప చర్యలు తీసుకొని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..!
ఈరోజు తాము కలుషితమైన ఆహారం తిని చికిత్స పొందిన విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోడానికి ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాల వస్తే లోనికి అనుమతించని పరిస్థితి, ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో గురుకుల నిర్వాహణ అని ఎద్దేవా చేశారు..!
నిరుపేద పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, రానున్న రోజుల్లో గురుకుల కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు.!
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు fon CHESI,మేము వచ్చింది ఇక్కడ ఆందోళన చేయడానికి కాదని, ఇక్కడ గురుకుల కళాశాలలో లోపాలను తెలుసుకొని, మళ్లీ మీ
దృష్టికి తీసుకు రావడానికేనని అన్నారు..!
ఇక్కడ జరుగుతున్న విషయాలను పిల్లలతో మాట్లాడనీయకుండా నిర్బంధించి, కలెక్టర్ అనుమతి లేకుండా ఎవరూ రావద్దని ఒక ఆంక్షలు పెట్టడం సరికాదని హెచ్చరించారు..!
ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే గురుకులాల్లోకి ఎవరినైనా అనుమతించి, విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని, విద్యార్థులు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా వసతులు కల్పిస్తోంది అని చెప్పాలి..!
కాని గేట్ల కు తాళాలు వేసి, ఎవరిని రానివ్వం అని ప్రిన్సిపల్ బెదిరించి ఎవరిని అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు